సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దక్ష నగార్కర్.. తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తోంది. షూటింగ్ సమయంలో, షూట్ తర్వాత షాట్ అంటూ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతున్న దక్ష అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 2007లో 'భూగాథ' అనే కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ ముంబై ముద్దుగుమ్మ. 2015లో ‘ఏకే రావు పీకే రావు’ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'హోరా హోరీ' 'హుషారు' చిత్రాల్లో నటించిన దక్ష.. 'జాంబీ రెడ్డి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'బంగార్రాజు' సినిమాలో 'ఎంత సక్కగుందిరో' సాంగ్ లో నాగచైతన్యతో కలిసి ఆడిపాడి, అందరినీ ఆకట్టుకుంది. 'బంగార్రాజు' సక్సెస్ మీట్ లో నవ్వుతూ చైతూకి సైగ చేసే వీడియోతో వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. రవితేజ హీరోగా నటించిన 'రావణాసుర' సినిమాలో దక్ష నగార్కర్ కీలక పాత్ర పోషించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించినా, హాట్ హాట్ అందాలు ఆరబోసినా, ఎందుకనో అమ్మడు క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది.