T20 World Cup గెలుచుకున్న టీమిండియా సగర్వంగా ఇండియా చేరుకుంది.



కప్పుతో తిరిగొచ్చిన రోహిత్ సేనకు అపూర్వ సాగతం పలికిన కేంద్ర ప్రభుత్వం, క్రీడాభిమానులు



బార్బొడాస్‌లో విమానం బయల్దేరినప్పటి నుంచి ఢిల్లీలోని హోటల్‌కు చేరుకునే వరకు సందడి చేసిన ఆటగాళ్లు



13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సాధించిందన్న ఆనందం అందరిలో కనిపించింది.



రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అంతా ఆనందంతో డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు.



వారికి అభివాదం చేస్తూ టీ 20 వరల్డ్‌కప్‌ ట్రోఫీని చూపిస్తూ ప్రత్యేక బస్‌లో హోటల్‌కు వెళ్లిపోయారు.



ఓపెన్ టాప్ బస్‌పై టీమ్ సభ్యులంతా నిల్చొని అభిమానులకు అభివాదం చేస్తూ హోటల్‌కు చేరుకున్నారు.



దారి పొడవునా జనాలు వారిని అనుసరిస్తూ వారిని ఉత్సాహ పరిచారు.



టీం సభ్యులంతా ట్రోఫీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి వెళ్తున్నప్పుడు తీసిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.