టీ 20 వరల్డ్ కప్ గెలుచుకున్న రోహిత్‌ సేనకు అఖండ స్వాగతం పలికారు జనం



ఢిల్లీ విమాశ్రయంలో దొరికిన ఆహ్వానం ఒకెత్తైతే... ముంబైలో దానికి పదింతలు జనం వచ్చారు.



ముంబై వీధులు మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. తరలి వచ్చిన జనాన్ని చూసిన క్రికెటర్లంతా ఉత్సాహంతో స్టెప్పులేశారు.



ముంబైలో బస్‌పై ఊరేగుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు ఆటగాళ్లంతా



మైదానానికి కిలోమీటర్ల దూరంలో కిక్కిరిసిపోయారు. వాహనాలు వెళ్లేందుకు వచ్చేందుకు వీలు లేనంతగా నిండిపోయారు.



ఉప్పెనలా తరలి వచ్చిన జనాన్ని చూసిన క్రికెటర్లంతా ఆనంద తాండవం చేశారు.



మైదానానికి తరలి వచ్చిన జనాలను ఉత్సాహపరిచేందుకు గ్రౌండ్ అంతా తిరుగుతూ డ్యాన్స్‌లు వేశారు.



టీ20 గెలుచుకున్న టీమిండియాను ఘనంగా దేశం సన్మానించింది. రోహిత్ సేన అడుగు పెట్టినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు జనం బ్రహ్మరథం పట్టారు.



ముంబయి తీరం జనంతో ఉర్రూతలూగింది. క్రికెటర్ల పేర్లతో నినాదాలు చేస్తూ ఉన్న ఆ విజువల్స్ చూస్తే గూజ్‌బంప్స్‌ వచ్చేలా ఉన్నాయి.



భారత్‌ మాతాకీ జై జయహో భారత్‌ వందేమాతరం నినాదాలతో ముంబై తీరంతోపాటు వాంఖడే స్టేడియం మారుమోగిపోయింది.