టెస్టు క్రికెట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పేశాడు.



2013 నవంబర్‌ 6న ఈడెన్ గార్డెన్‌లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి వచ్చాడు.



తొలి మ్యాచ్‌లోనే 177 పరుగులు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ



రోహిత్ శర్మ 2022లో శ్రీలంకతో సిరీస్ నుంచి టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.



రోహిత్ శర్మ ఒక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా ఆడుతూ ఎక్కువ పరుగుల చేసిన ఇండియన్ క్రికెటర్.



2019లో దక్షిణాఫ్రికాపై 212 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో 19 సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించాడు.



ఒక టెస్టు సిరీస్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు ఉంది



టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలపై సెంచరీలు చేసిన కొద్ది మంది క్రికెటర్స్‌లో రోహిత్ ఒకడు.



టెస్టు కెప్టెన్‌గా స్వదేశంలో ఒక్క సిరీస్ ఓడిపోని కెప్టెన్‌గా రికార్డు రోహిత్ పేరు మీదే ఉంది.



టెస్టు ప్లేయర్‌గా, టెస్టు జట్టు కెప్టెన్‌గా చాలా రికార్డులు రోహిత్ శర్మ పేరిట ఉన్నాయి.



రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న నాగపూర్‌లో జన్మించాడు.



రోహిత్‌ తండ్రి గురునాథ్‌,తల్లి పూర్ణిమా శర్మ. ఆమె విశాఖకు చెందిన వ్యక్తి.