సచిన్ టెండూల్కర్‌కు BCCI నెలకు ఎంత పెన్షన్ ఇస్తుందంటే?

Published by: Jyotsna

సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ అంటారు.

భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవ అపారం.

ఈ లెజెండ్ మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు, 463 వన్డేలు ఆడారు.

రిటైర్డ్ ఆటగాళ్లకు bcci నెలసరి పెన్షన్ అందజేస్తుందని మీకు తెలుసా?

క్రికెట్‌కు సంపూర్ణంగా అంకితమైన మాజీ ఆటగాళ్లకు బీసీసీఐ ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఆటగాళ్ళు ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా పెన్షన్ ను నిర్ణయింస్తారు.

సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ నుంచి నెలకు రూ.70,000 పెన్షన్ అందుతోంది

ఇది క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బీసీసీఐ ఇస్తోంది

బిసిసిఐ ఇచ్చే పెన్షన్ నిజానికి సచిన్ వంటి దిగ్గజాలకు అవసరం కాదు ఒక గౌరవం.

ఎందుకంటే కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ధనిక ఆటగాళ్లలో సచిన్ ఒకరు.

సచిన్ టెండూల్కర్ నికర ఆస్తుల విలువ సుమారు 1400 కోట్లు.