18 ఏళ్ళ కెరియర్లో ఇది రోహిత్ తొలి హాఫ్ సెంచరీ.. ఎలా అంటే?

Published by: Jyotsna

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది.

రెండు జట్ల మ్యాచ్ దుబాయ్ లో జరుగుతోంది.

ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు.

రోహిత్ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు, ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

రోహిత్ తన 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌లో అర్ధశతకం సాధించాడు.

గతంలో 8 ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడినా, రోహిత్ ఇప్పటి వరకు 50 పరుగుల మార్క్‌ను దాటలేదు.