ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ - న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరగనుంది.

ఈ సందర్భంగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్స్‌లో ఎలా రాణించాడో చూద్దాం

ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్స్‌లో రోహిత్ శర్మ 8 మ్యాచ్‌లు ఆడారు.

ఈ 8 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లో 27.33 సగటుతో 246 పరుగులు చేశారు.

అయితే, ఈ ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేదు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

ఇప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గెలిచి మరో ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని రోహిత్ శర్మ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రోహిత్ శర్మ 421 పరుగులు చేశారు.

ఫైనల్‌లో 79 పరుగులు చేయగలిగితే, ఈ మైదానంలో 500 వన్డే పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలుస్తారు.