విరాట్ కోహ్లీ తన అసాధారణ ఫిట్‌నెస్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తున్నాడు.

36 ఏళ్ల వయస్సులో కూడా అద్భుత ఫిట్నెస్ తో ఆకట్టుకుంటున్నాడు.

చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై అద్భుతమైన శతకంతో భారత్‌కు విజయం అందించిన కోహ్లీ

విరాట్ కోహ్లీ తినే ఒక అద్భుతమైన సలాడ్ మనమూ ట్రై చేయవచ్చు .

సలాడ్ కోసం బ్రోకోలీ , ఇతర సీజనల్ కూరగాయలను శుభ్రంగా కడిగి సిద్ధం చేయండి.

దానికి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న కార్న్ ని యాడ్ చేసి కాస్త ఉడికించండి.

అందులో దానిమ్మ , ద్రాక్ష, కీరా ముక్కలనుకలపండి, ఇవి రుచిని , పోషక విలువను పెంచుతాయి.

దీనికి కాస్త వేగించిన పనీర్ ముక్కలను కలపండి

స్వల్పంగా ఉప్పు , మిరియాల పొడిని చేర్చండి.

చివరిగా, కొద్దిపాటి ఒలివ్ ఆయిల్‌ను సలాడ్‌పై చల్లి, కలపండి. కోహ్లీ ఫేవరెట్ సలాడ్ రెడీ ..