వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ టాప్‌లో ఉన్నాడు.
1995-2012 మధ్య ఆడిన పాటింగ్ 374 వన్డేల్లో 41.81 సగటుతో 13,589 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు 82 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. 1996 -2008 మధ్య 286 వన్డేల్లో 35.93 సగటుతో 9,595 పరుగులు చేశాడు. 16 సెంచరీలు ఉన్నాయి.
మార్క్ వా మూడో స్థానంలో ఉన్నాడు. 1988-2002 మధ్య 244 వన్డేల్లో 39.35 సగటుతో 8,500 పరుగులు చేశాడు. 18 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు చేశాడు.
మైఖేల్ క్లార్క్ నాల్గో స్థానంలో ఉన్నాడు. 2003-2015 మధ్య 245 వన్డేల్లో 44.58 సగటుతో 7,981 పరుగులు చేశాడు. 8 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
స్టీవ్ వా(1986 -2002) ఐదో స్థానంలో ఉన్నాడు. 325 వన్డేల్లో 32.90 సగటుతో 7,569 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
డేవిడ్ వార్నర్(2009-2023)ఆరో స్థానంలో ఉన్నాడు. 161 వన్డేల్లో 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు- 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మైఖేల్ బెవాన్ (1994 -2004)ఏడో స్థానంలో ఉన్నాడు. 232 వన్డేల్లో 53.58 సగటుతో 6912 పరుగులు చేశాడు. 6సెంచరీలు. 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అలెన్ బోర్డర్(1979-1994) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 273 వన్డేల్లో 30.62 సగటుతో 6,524 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు చేశాడు.
మాథ్యూ హేడెన్(1993-2008) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 160 వన్డేల్లో 44.10 సగటుతో 6,131 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు , 36 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
డీన్ జోన్స్(1984- 1994) పదో స్థానంలో ఉన్నాడు. అతను 164 వన్డేల్లో 44.61 సగటుతో 6,068 పరుగులు చేశాడు. అందులో 7సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి.