ఈ రోజుల్లో చాలా మంది విదేశాల్లో రకరకాల కారణాలతో ఉండాల్సి వస్తోంది.

అయితే అక్కడికి వెళ్లిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ దొరకడం కష్టం.

కొన్ని దేశాల్లో మన లైసెన్స్ కొంత కాలం చెల్లుతుందని మీకు తెలుసా?

ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక ఏడాది, నార్త్ ఆస్ట్రేలియాలో 3 నెలలు మన లైసెన్స్ చెల్లుతుంది.

యూఎస్ఏ లో అక్కడికి చేరుకున్నాక ఏడాది పాటు ఇండియన్ లైసెన్స్ తో డ్రైవింగ్ చెయ్యవచ్చు.

ఇంగ్లిష్ లైసెన్స్ తో పాటు ఇండియన్ లైసెన్స్ ఉంటే స్విట్జర్లాండ్ లో తాత్కాలికంగా సుమారుగా ఒక ఏడాది పాటు డ్రైవింగ్ చేసుకోవచ్చు.

జర్మన్ ట్రాన్స్లేషన్ తో 6 నెలల పాటు ఇండియన్ లైసెన్స్ చెల్లుతుంది.

న్యూజిలాండ్ లో కూడా ఏడాది పాటు మన లైసెన్స్ వాడుకోవచ్చు.

యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లలో లైసెన్స్ ఇంగ్లిష్ లో ఉంటే చెల్లుతుంది. అయితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి.

ఫ్రాన్స్ లో మాత్రం అధికారికంగా ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ తో ఉండి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ తో ఇబ్బంది లేకపోతే డ్రైవింగ్ చేసుకోవచ్చు.



Images courtesy : Pexels