అన్నం ఇలా వండితే చాలా డేంజర్



అన్నం సరిగా వండితేనే ఆరోగ్యకరం. సరిగా ఉడకని అన్నం తింటే చాలా డేంజర్.



అన్నాన్ని వండే విధానంలోనే ఆరోగ్యం దాగుంది. ఉడకని అన్నం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.



సరిగా ఉడకని అన్నంలో క్యాన్సర్ కారకం అయిన ఆర్సెనిక్ ఉండే అవకాశం ఉంది.



వరిపంటకు చేసిన క్రిమిసంహారకాలు మట్టి ద్వారా మొక్కలకు, తరువాత పంటకు చేరుతుంది. అవి రసాయనాలు ఆర్సెనిక్‌గా మారతాయి.



ఇలా ఉడకని అన్నాన్ని తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది.



ఒక కప్పు బియ్యానికి అయిదు కప్పులు నీళ్లు వేసి బాగా ఉడికిస్తే ఆర్సెనిక్ సమస్య లేకుండా ఉంటుంది.



అన్నం ముద్దయితే తినడానికి చాలా మంది ఇష్టపడరు. నిజానికి ఎక్కువ నీళ్లలో ఉడికించిన అన్నమే ఆరోగ్యానికి మంచిది.



బియ్యాన్ని కొన్ని గంటల పాటూ నానబెట్టి వండినా కూడా ఆర్సెనిక్ లక్షణాలు తగ్గుతాయి.