బీపీ, గుండె జబ్బుల వంటి సమస్యలను నివారించేందుకు ఉఫ్పు తగ్గించి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. ఒక వ్యక్తి సగటున రోజుకు రెండు స్పూన్ల ఉప్పు తీసుకుంటారట. ఇది 10.78 గ్రాములకు సమానం. అయితే తప్పకుండా ఈ మోతాదును తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. 2-15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఒక టీస్పూన్ కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గిస్తే సోడియం శరీరంలో చేరే పరిమాణం తగ్గుతుంది. సాస్ లు, డ్రెస్సింగ్ టాపప్ ల వాడకం తగ్గించడం ద్వారా మరింత ఉప్పు శరీరంలో చేరడాన్ని నివారించవచ్చు. రోజుకు 10 గ్రాములకు మించి సాధారణ ఉప్పు వినియోగించే వారిలో స్టమక్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందట. జపాన్, చైనా. అమెరికా, స్పెయిన్ కు చెందిన నిపుణులు వేర్వేరు అధ్యయనాల ద్వారా ఈ విషయాలను వెల్లడి చేశారు. ఆహరపదార్థాల తయారిలో మనం కేవలం 5 గ్రాములకు మించకుండా సాధారణ ఉప్పు వినియోగాన్ని పరిమితం చెయ్యాలట. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు Images courtesy : Pexels