శరీరంలో ముఖ్యమైన అవయవం కిడ్నీ. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీల్లో ఏమైనా సమస్యలు వస్తే.. వ్యర్థాలు బయటకు వెళ్లలేక శరీరంలో పేరుకుపోతాయి. కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోతే అనేక జబ్బులతో బాధపడతారు. ప్రాణాలు కూడా పోతాయ్. విటమిన్ల లోపం వల్ల కూడా కిడ్నీలు పాడవుతాయి. ఉప్పు అతిగా తింటే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. సోడియం, పాస్పరస్ ఎక్కువగా ఉండే ప్రోసెస్డ్ ఫుడ్ తిన్నా సరే ప్రమాదమే. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడేవారికి కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అది చాలా ప్రమాదకరం. నీరు తక్కువగా తాగడం కూడా ప్రమాదకరమే. రోజూ సరైన మోతాదులో నీళ్లు తాగితే కిడ్నీలు సేఫ్. Images Credit: Pexels