దాల్చిన చెక్కతో క్యాన్సర్‌కు చెక్



మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ముఖ్యమైనది. ఇది లేనిదే బిర్యానీకి ఘుమఘమలు రావు.



చాలా మంది దాల్చిన చెక్క తినాల్సిన అవసరం లేదు అనుకుంటారు. నిజానికి దీని వల్ల ఎన్నో లాభాలు.



దీనిలో ఐరన్, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.



దీనిలో మొక్కల జాతికి చెందిన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీని పేరు సినమల్ డి హైడ్.



ఈ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.



మధుమేహులకు ఈ దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది.



దాల్చిన చెక్క తినడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ రాకుండా ఉంటుంది.



శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఇది అడ్డుకుంటుంది.