'థగ్ లైఫ్' మినీ రివ్యూ: రొటీన్ యాక్షన్ డ్రామానా? కమల్, శింబుకు ఫ్లాప్ తప్పదా?

కథేంటి?: రంగరాయ శక్తివేల్ (కమల్ హాసన్) గ్యాంగ్‌స్టర్. పోలీసులు ఎటాక్ నుంచి తప్పించుకోవడంలో అమరన్ (శింబు) సాయపడతాడు.

శక్తివేల్, అమరన్ సొంత తండ్రీ కొడుకుల కంటే ఎక్కువ ప్రేమగా ఉంటారు. వాళ్ళ మధ్య ఒకరినొకరు చంపేంత పగ ఎందుకు వచ్చింది?

ఇంద్రాణి (త్రిష), అన్యలక్ష్మి (అభిరామి), మాణిక్యం (నాజర్) ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: మణిరత్నం దర్శకత్వం, కమల్ హాసన్ నటన కోసం అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే చిత్రమిది.

ఫస్టాఫ్ పర్వాలేదు. కొన్ని ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ పడ్డాయి. ఇంటర్వెల్ ఫైట్ బాగా తీశారు. కానీ, సెకండాఫ్ అసలు బాలేదు.

రెగ్యులర్ రొటీన్ డ్రామా తప్ప కమల్ - మణి కాంబో నుంచి ఆశించే మేజిక్ 'థగ్ లైఫ్‌'లో లేదు. అంతా ప్రెడిక్టబుల్.

రెహమాన్ సాంగ్స్ బావున్నా... సీన్స్‌తో ఆర్ఆర్ సింక్‌లో లేదు. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

కమల్, శింబు బాగా చేశారు. బార్ డాన్సర్‌గా త్రిష రోల్ వేస్ట్ అయ్యింది. మిగతా ఆర్టిస్టులు ఓకే.

థగ్ లైఫ్... ఇదొక బోరింగ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. లెజెండ్స్ కమల్, మణి కోసం వెళితే డిజప్పాయింట్ చేస్తుంది.