ఇప్పుడు బాలీవుడ్ స్టార్లుగా ఎదుగుతున్న చాలామందికి ఒకప్పుడు కనీసం ఇల్లు కూడా లేదు. వారెవరో మీరే చూసేయండి.

ముంబాయ్‌కు వచ్చినప్పుడు ఇల్లు లేక చాలాకాలం మెరీన్ డ్రైవ్ దగ్గరే పడుకున్నారు అమితాబ్ బచ్చన్.

సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో షారుఖ్ ఖాన్ రోడ్డుపైనే పడుకునేవాడట.

15 ఏళ్లకే ఇంటిని వదిలేసి, రోడ్లపై పడుకొని ఎంతో కష్టాలు పడింది కంగనా రనౌత్.

ఆర్థిక ఇబ్బందులు, సొంతిల్లు లేకపోవడం లాంటి ఇబ్బందులను దేవ్ ఆనంద్ కూడా ఎదుర్కున్నారు.

రోనిత్ రాయ్ స్టార్ అవ్వకముందు సొంతిల్లు లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను పడ్డారు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇల్లు లేక ఒక గ్యారెజ్‌లో పడుకునేవారట అనిల్ కపూర్.

నవాజుద్దీన్ సిద్ధికి నటుడు అవ్వడానికి వచ్చి కొన్నిరోజులు వాచ్‌మ్యాన్‌గా పనిచేశారు.

ఒక్క అద్దె రూమ్‌లో 12 మందితో కలిసి కష్టంగా జీవితాన్ని కొనసాగించాడు అక్షయ్ కుమార్.

ముంబాయ్‌కు వచ్చిన కొత్తలో మిథున్ చక్రవర్తికి తనకంటూ సొంతిల్లు లేదు. (All Images Credit: Social Media)