చీరలో మృణాల్ ఠాకూర్ డెడ్లీ కాంబినేషన్ అని ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి తన శారీ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి.

ప్లెయిన్ కలర్ చీర, దానిపై ఫుల్ లెన్త్ జాకెట్.. మీ శారీ లుక్‌కు మోడర్న్ టచ్ ఇస్తుంది.

‘హాయ్ నాన్న’లో మృణాల్ లుక్ మీకు ఇష్టమయితే ఈవెంట్‌లో స్పెషల్‌గా కనిపించాలంటే మీరూ ఈ లుక్ ఫాలో అయిపోండి.

క్రీమ్ కలర్ చీరపై చిన్న చమ్కీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్.. పర్ఫెక్ట్ మృణాల్ ఠాకూర్ స్టైల్ దేశీ గర్ల్ లుక్.

ఎర్ర బోర్డర్ ఉన్న చీరపై స్లీవ్‌లెస్ బ్లౌజ్, పెద్ద జుంకాలు పర్ఫెక్ట్ కాంబో అని మృణాల్ ప్రూవ్ చేస్తోంది.

రెడ్ కలర్ శారీ, దానిపై హెవీ వర్క్ బ్లౌజ్.. ఈవెంట్స్‌లో మీరూ హైలెట్ అయ్యేలా చేస్తుంది.

ఇలాంటి ప్రింట్ షిమ్మరింగ్ చీరలు.. కాక్‌టెయిల్ పార్టీలకు సరిగ్గా సరిపోతాయి.

అందరిలోనూ డిఫరెంట్‌గా కనిపించాలంటే ఇలాంటి ఒక డిజైనర్ వేర్ శారీ ట్రై చేస్తే బెటర్.

పింక్, క్రీమ్ కాంబినేషన్ చీర.. దానిపై లైట్ పింక్ కలర్ బ్లౌజ్.. పెళ్లిళ్లలో సింపుల్‌గా కనిపించేలా చేస్తుంది.

All Images And Video Credit: Mrunal Thakur/Instagram