స్మృతి మంధానను ట్రెడిషనల్ డ్రస్ లలో చూస్తే... పెళ్లికి అలా వెళ్లాలని అమ్మాయిలు అనుకోవడం గ్యారెంటీ. ఎంబ్రాయిడరీ చేయించిన సూట్ సెట్ ధరిస్తే... పెళ్లిలో హుందాగా ఉంటుంది. పింక్ కలర్ చుడిదార్ సెట్ మీద స్మృతి మంధాన తరహాలో వర్క్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. లైట్ కలర్ క్లాత్ మీద ఫ్లవర్స్ ప్రింట్ చేయించిన డ్రస్ ట్రెండీగా, యూత్‌ఫుల్‌గా ఉంటుంది. లెహంగా మీద వర్క్ చేయించిన బ్లౌజ్ అండ్ జాకెట్ ధరిస్తే పెళ్లికి పర్ఫెక్ట్ డ్రస్ రెడీ అంతే! పెళ్లిలో స్టైలిష్ అప్పియరెన్స్ ఉండాలని అనుకుంటే ఈ విధమైన డ్రస్ ఎంపిక చేసుకోండి. పెళ్లిలో అనార్కలి డ్రస్ కూడా మంచి ఆప్షన్. అనార్కలి కలర్ అయితే ఇంకా మస్త్ ఉంటుంది. కుర్తీ పలాజో కాంబినేషన్ ఒక్కటి అయినా సరే అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో ఉండాలి. లాంగ్ కుర్తీస్, చుడిదార్స్ కూడా పెళ్లికి వేసుకుని వెళ్లడానికి బావుంటాయి. మరిన్ని ఫ్యాషన్ టిప్స్, డ్రెస్సింగ్ ఐడియాస్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి (all images courtesy: smriti_mandhana / Instagram)