వర్షంలో తడిచారా? వెంటనే ఇలా చెయ్యండి, లేకపోతే...

వర్షంలో తడిస్తే బాగానే ఉంటుంది. కానీ, ఆ తర్వాతే జ్వరాలతో బాధపడాలి.

అందుకే, వర్షంలో తడిచిన వెంటనే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వర్షంలో తడిచిన వెంటనే తలను శుభ్రం చేసుకోవాలి. తడిచిన బట్టలతో ఎక్కువ సేపు ఉండకూడదు.

తడి బట్టలతో ఉంటే.. జలుబు, జ్వరం వంటి వైరల్ సమస్యల బారినపడతారు.

ఇంటికి రాగానే గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యాలి.

వర్షంలో తడిచిన తర్వాత స్నానం చేయకపోతే అలర్జీలు వస్తాయి. బ్యాక్టీరియాలు శరీరంపై ఎటాక్ చేస్తాయి.

మీ ఇంట్లో యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్ ఉన్నట్లయితే.. స్నానం తర్వాత రాసుకోండి.

వెంటనే ఫ్యాన్ వేసుకోవద్దు. ఏసీలో ఉండవద్దు. కాసేపు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండండి.

ఆ తర్వాత హెర్బల్ టీ లేదా అల్లం టీ తాగండి. శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.