గానగంధర్వుడు, లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 78వ జయంతి నేడు(జూన్ 4).

బాలు 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేట‌మ్మ పేట గ్రామంలో జ‌న్మించారు.

ఎస్పీబీ పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

4 ద‌శాబ్దాల‌ సినీ ప్రయాణంలో 16 భాషల్లో 4 వేలకు పైగా పాటలతో వరల్డ్ రికార్డ్ సృష్టించారు.

గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇండస్ట్రీకి సేవలు అందించారు.

'శ్రీశ్రీశ్రీ మ‌ర్యాద రామ‌న్న'(1966) చిత్రం కోసం మొదటిసారి పాట పాడారు ఎస్పీబీ.

'పెళ్ళంటే నూరేళ్ళ పంట' (1969) చిత్రం ద్వారా తొలిసారి వెండితెర మీద కనిపించారు.

'శ్రీరామరాజ్యం' సినిమా తమిళ్ వర్షన్ లో నందమూరి బాలకృష్ణకు గాత్రదానం చేశారు బాలు.

Image Source: Twitter 'X'

ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డులు, 23 నంది అవార్డులు అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎస్పీబీని పద్మశ్రీ (2001), పద్మభూషణ్(2011) పురష్కారాలతో సత్కరించింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు.