ఔరా, సారాకు చదువంటే ఎంత శ్రద్ధ - ఇంతకీ ఆమె ఏం చదివిందో తెలుసా?

సారా అలీ ఖాన్... బాలీవుడ్‌లో ఎప్పుడూ ట్రెండింగులో ఉండే పేరు ఇది.

బాలీవుడ్ నటులు అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల ముద్దుల కూతురు ఈమె.

ఎప్పుడూ ఒకే టైపు సినిమాల్లో.. రొటీన్ హీరోయిన్‌గా నటించడం ఈమెకు ఇష్టం ఉండదు.

సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా సారా అందాల వరద పారిస్తుంది.

అందుకే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 45.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

తాజాగా ఆమె పింక్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిస్తున్న పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఒక ఫొటోలో సారా.. మంచంపై పడుకొని పుస్తకం చదువుతోంది.

దీంతో ఆమె అభిమానులు.. సారాకు చదువంటే చాలా శ్రద్ధ అని కామెంట్స్ చేస్తున్నారు.

అన్నట్టు.. సారా కొలంబియా యూనివర్శిటీలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌ పూర్తి చేసింది.