సమంత.. సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో హిట్ సినిమాలు చేసి, అభిమానులను సంపాదించుకున్నారు. రవి వర్మన్ డైరెక్ట్ చేసిన 'మాస్కోవిన్ కావేరి ' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'ఏ మాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేశారు. ఇక అక్కడ నుంచి సమంత చేసిన దాదాపు అన్నీ సినిమాలు హిట్టే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సమంత తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సమంత మొదటి సంపాదన రూ.500. కానీ, ఇప్పుడు ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు! వరుస సినిమాలు చేసిన ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచేశారట. ఒక్కో సినిమాకి కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్.