ఎన్నికల్లో గెలిచిన సినీ స్టార్స్ వీరే.. ఈ సారి లిస్టు పెద్దదే! 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు పోటీకి దిగి విజయం సాధించారు. వారి వివరాలివే. పవన్ కళ్యాణ్: పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత ఘన విజయం సాధించారు. బాలకృష్ణ: హిందూపురంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కంగనా రనౌత్: హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. రవి కిషన్: ‘రేసు గుర్రం’ నటుడు రవి కిషన్ బీజేపీ ఎంపీగా గెలిచారు. రచన: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. సురేష్ గోపి: కేరళలోని త్రిసూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. హేమామాలిని: మధురాలో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. శతృఘ్న సిన్హా: పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా గెలుపొందారు.