రేవ్ పార్టీ కేసు కారణంగా నటి కొల్లా హేమ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజోలుకు చెందిన హేమ.. 1989లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తెలుగు తమిళ హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 250కి పైగా చిత్రాల్లో నటించింది. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాకి ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డ్ గెలుచుకుంది. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో సీజన్-3 లో పార్టిసిపేట్ చేసింది హేమ. సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమ వివాహం చేసుకుంది హేమ. వీరికి ఈషా అనే కుమార్తె ఉంది. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం బీజేపీలో ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆ పేరుతోనే రేవ్ పార్టీలో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనేక మలుపుల అనంతరం బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయింది.