నేడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా దేవర పార్ట్‌ 1 యూనిట్‌ శుభాకాంక్షలు చెప్పింది.



5 జులై 1978లో జన్మించిన కల్యాణ్‌ రామ్‌ తాతా ఎన్టీఆర్‌ పేరుతో బ్యానర్‌ పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు.



మొదట నందమూరి ఫ్యామిలీ సినిమాలు మాత్రమే నిర్మించాడు.



ఎన్టీఆర్‌ బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా అతనొక్కడే మంచి కమర్షియల్ హిట్ అందుకుంది.



ఎన్టీఆర్‌ బ్యానర్‌పై వచ్చిన సినిమాలు హరే రామ్, జయీభవ, కళ్యాణ్‌రామ్ కత్తి, ఓం 3డి పెద్దగా హిట్‌ కొట్టలేకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.



ఎన్టీఆర్‌ బ్యానర్‌పై 2015లో పటాస్‌తో మంచి హిట్ కొట్టాడు కల్యాణ్‌ రామ్. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.



తనకు అతనొక్కడే లాంటి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో రవితేజ హీరో కిక్ 2 ఈ బ్యానర్‌పై తీసి చేతులు కాల్చుకున్నారు.
ఈ బ్యానర్‌పై నందమూరి హీరో కాకుండా నిర్మించిన తొలి చిత్రం ఇది


పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తర్వాత వచ్చిన ఇజమ్‌ ఆకట్టుకోలేకపోయింది.



అనంతరం వచ్చిన, జై లవ కుశ ప్రేక్షకాదరణ పొంది మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.



ఇప్పుడు ఎన్టీఆర్‌ బ్యానర్‌పై ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర పార్ట్ 1 వస్తోంది.