‘పుష్ప 2’ నుండి విడుదలయిన ‘సూసేకి’ పాటతో ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ రీల్స్ చేశారు.

తాజాగా ఆ లిస్ట్‌లోకి ‘నా సామిరంగ’ బ్యూటీ అషికా రంగనాథ్ కూడా యాడ్ అయ్యింది.

లేట్ అయ్యానని తెలుసు కానీ నా డ్యాన్స్ మీకు ఇష్టమని పోస్ట్ చేస్తున్నాను అంటూ ‘సూసేకి’ రీల్‌ను షేర్ చేసింది.

లైట్ బ్లూ కలర్ లెహెంగాలో అషికా వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

‘పుష్ప 2’ కోసం ఎదురుచూస్తున్న వారిలో తాను కూడా ఉన్నానని చెప్పుకొచ్చింది.

కన్నడలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అషికా.. ‘అమిగోస్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.

నాగార్జునతో నటించిన ‘నా సామిరంగ’తో టాలీవుడ్‌లో తనకు రీచ్ పెరిగింది.

ఇప్పుడు ఏకంగా మెగాసార్ చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్రలో కనిపించనుంది.

కన్నడలో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది అషికా రంగనాథ్.

All Images And Video Credit: Ashika Ranganath