పూల తోటలో హాయిగా నిద్రిస్తున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకవేళ లేకపోతే నెక్స్ట్ ఫోటో చూడండి! అవును... ఈ అమ్మాయి సీతే! 'సీతా రామం'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరాఠీ భామ మృణాల్ ఠాకూరే! ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ స్కాట్లాండ్‌లో ఉన్నారు. అక్కడ లావెండర్, సన్ ఫ్లవర్ తోటల్లో షికార్లు చేస్తున్నారు. ఒకవైపు ప్రకృతి సోయగం, మరోవైపు మృణాల్ అందం... చూపు తిప్పుకోనివ్వడం లేదు కదూ! ఆకాశంలో మబ్బుల్ని మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఈ ఫోటోల్లో బంధించారు కదా! మృణాల్ ఫోటోలు సమంత దృష్టిని ఆకర్షించాయి. 'నువ్వు సన్ షైన్' అని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, మహిమా మక్వాన్, సింగర్ శిల్పా రావు తదితరులు మృణాల్ ఫోటోలకు కామెంట్ చేశారు. స్నేహితులతో స్కాట్లాండ్‌లో మృణాల్ ఠాకూర్ (All Images Courtesy: mrunalthakur / Instagram)