'మాస్ జాతర'లో రైల్వే పోలీస్ ఎస్సైగా మాస్ మహారాజా రవితేజ నటించారు. 'నేను రైల్వే పోలీస్ కాదు... క్రిమినల్ పోలీస్' అంటూ ఆయన డైలాగ్ కూడా చెప్పారు.
'ధమాకా' తర్వాత రవితేజ సరసన శ్రీలీల మరోసారి నటించిన సినిమా 'మాస్ జాతర'. ఇందులో శ్రీకాకుళం అమ్మాయిగా, ఆ యాసలో డైలాగ్స్ చెప్పింది.
మాస్ జాతర'లో నవీన్ చంద్ర విలన్ రోల్ చేశారు. ఇంతకు ముందు ఆయన ఈ తరహా పాత్రలు చేసినా... ఈ సినిమాలో లుక్, క్యారెక్టర్ కొత్తగా కనిపిస్తున్నాయి.
'మాస్ జాతర' ట్రైలర్ మొత్తం మీద లుక్‌లో ఆకట్టుకున్నది నవీన్ చంద్ర అని చెప్పవచ్చు. రవితేజతో ఆయన చేసిన భారీ యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందట.
'మాస్ జాతర'లో నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఆయన రోల్ ఏమిటి? అనేది ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. హీరో రవితేజ తండ్రిగా చేసినట్టు టాక్.
హీరోయిన్ శ్రీ లీల తండ్రిగా సీనియర్ యాక్టర్ నరేష్ విజయకృష్ణ నటించారు. వాళ్ళిద్దరితో రాజేంద్ర ప్రసాద్ సీన్స్ నవ్విస్తాయట.
'మాస్ జాతర'లో రవితేజ రైల్వే పోలీస్ అయితే... స్టేషన్ మాస్టర్ దేవి ప్రియాగా కాదంబరి కిరణ్ నటించారు. ఓ ప్రముఖ జర్నలిస్ట్ ట్విట్టర్ హ్యాండిల్ పేరు అది కావడంతో ఈ క్యారెక్టర్ హైలైట్ అవుతోంది.
'హైపర్' ఆది, అజయ్ ఘోష్, తమిళ నటుడు వీటీవీ గణేష్ సైతం 'మాస్ జాతర'లో నటించారు. వాళ్ళు విలన్ గ్యాంగులో కనిపిస్తారని తెలిసింది.
'మాస్ జాతర'లో ప్రవీణ్ కానిస్టేబుల్ రోల్ చేశారు. హీరోతో పాటు కొన్ని సీన్లలో నటి హిమజ సైతం కనిపిస్తారు.