పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ‘పీటీ సార్’ బ్యూటీ కాశ్మీరా, ఈమె తెలుగు సినిమాలివే! అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ‘పీటీ సార్’ మూవీలో మెరిసిన ఈ బ్యూటీ గుర్తుందా? ఈమె పేరు కాశ్మీరా పరదేశీ. తమిళంలో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. కాశ్మీరా తెలుగు సినిమాల్లో కూడా నటించిందనే సంగతి మీకు తెలుసా? కశ్మీరా ఫస్ట్ మూవీ.. ‘నర్తన శాల’. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్‌గా మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాశ్మీరా కిరణ్ అబ్బవరంతో కలిసి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీలో నటించింది. ఆ మూవీకి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో కాశ్మీరాకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఆమె కోలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. తాజాగా విడుదలైన ‘పీటీ సార్’ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. కాశ్మీరా తెలుగు, తమిళ సినిమాల్లోనే కాదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘ది ఫ్రిలాన్సర్’ వెబ్ సీరిస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో దూసుకెళ్తోంది.