రియల్ లైఫ్‌లో తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రీల్ లైఫ్‌లో మాత్రం ఎప్పుడో అమ్మగా మారింది.

దీపికా ఇప్పటికే పలు సినిమాల్లో అమ్మగా నటించి మెప్పించింది.

ఇటీవల విడుదలయిన ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌లో దీపికా తల్లిగా కనిపించింది.

బేబీ బంప్‌తో ఉన్న దీపికా క్యారెక్టర్‌.. ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘కల్కి 2898 AD’ కంటే ముందు కూడా ఆమె పలు సినిమాల్లో అమ్మ పాత్రలో అలరించింది.

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’లో దీపికా ఒక గెస్ట్ రోల్‌లో తల్లిగా నటించింది.

‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1లో రణబీర్ కపూర్ తల్లి పాత్రలో కాసేపు కనిపించింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

ఇలా బ్యాక్ టు బ్యాక్ తల్లి పాత్రల్లో దీపికా నటించడంపై ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు.

హీరోయిన్‌గా చేయాల్సిన తను హీరోకు తల్లి పాత్రలు చేయడానికి ఒప్పుకోవడం గ్రేట్ అని అంటున్నారు.

All Images Credit: Deepika Padukone/Instagram