1992 జూన్‌లో నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వారి పెళ్లిరోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.

ఒక సినిమా షూటింగ్‌లో తన కాస్ట్యూమ్స్ సౌకర్యంగా లేవని అమల.. నాగార్జునతో ఏడుస్తూ చెప్పగా ఆయన ధైర్యం చెప్పారట.

అప్పటినుండి నాగార్జున, అమల మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.

అమెరికా ట్రిప్‌కు వెళ్లినప్పుడు అమలకు గ్రాండ్‌గా ప్రపోజ్ చేశారు నాగ్.

అమల ఓకే చెప్పడంతో చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది.

నాగార్జున పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వచ్చినా అమల ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ జంతువుల సంరక్షణలో బిజీ అయిపోయారు అమల.

నాగార్జున, అమల జంటకు అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం తను కూడా సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

All Images Credit: Amala Akkineni/Instagram