సిగరెట్ పొగతో జుట్టు రాలిపోవడం ఖాయం



ధూమపానం, మద్యపానం రెండూ కూడా జుట్టు ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి.



సిగరెట్ పొగలో ఉండే టాక్సిన్స్ తలమీద రక్తప్రసరణను తగ్గిస్తాయి.



దీనివల్ల ఎయిర్ ఫోలికల్స్ అంటే వెంట్రుకల కుదుళ్ళకు ముఖ్యమైన పోషకాలు, ఆక్సిజన్ అందవు. దీనివల్ల వెంట్రుకలు బలహీన పడతాయి.



ధూమపానం శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కూడా పెంచుతుంది. అందుకే ధూమపానం చేసేవారిలో జుట్టు పలుచగా ఉండే అవకాశం ఎక్కువ.



జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ధూమపానానికి దూరంగా ఉండాలి.



ధూమపానం మానేసిన నెల రోజుల తర్వాత జుట్టు పెరుగుదలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.



ధూమపానం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి వల్ల కూడా జుట్టు ఊడుతుంది.



జుట్టు మరీ ఎక్కువగా రాలుతుంటే వెంటనే డెర్మటాలజిస్టును కలవడం చాలా ముఖ్యం.