వానాకాలంలో ఆకాకరను కచ్చితంగా తినాల్సిందే



ఈ కూరగాయను ఆకాకరకాయ, ఆగాకర, అడవి కాకర, బోడ కాకర అని కూడా పిలుచుకుంటారు.



కాకరకాయతో పోల్చితే దీనిలో ఎలాంటి చేదు ఉండదు. కేవలం వానాకాలంలో మాత్రమే ఇది దొరుకుతుంది.



ఈ సీజన్లో మనకు వచ్చే వ్యాధులను అడ్డుకునే స్వాభావిక సామర్థ్యం దీనిలో ఉంటుంది. దీన్ని కాంటోలి అని కూడా పిలుస్తారు.



ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది.



దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికం.



డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం అంటే ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి.



జుట్టు రాలడం వంటి సమస్యలు ఇది తగ్గిస్తుంది. చెవి నొప్పి, దగ్గు, పొట్టలో ఇన్ఫెక్షన్లు వంటివి కూడా రాకుండా చేస్తుంది.



డయాబెటిక్ రోగులకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడానికి సహాయపడుతుంది.