బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజన్న, విక్రమార్కుడు, ఖలేజా లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'లూజర్' వెబ్ సిరీస్ కూడా చేసిన యానీ. బాలనటిగా అలరించిన యానీ.. ఇకపై హీరోయిన్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తోన్న వీడియోను షేర్ చేసిన యానీ. ప్రస్తుతం 'తికమక తాండ'తో కథానాయికగా యానీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'తికమక తాండ'. ఈ మూవీలో రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్నారు. Image Credits: Annie/Instagram