ఛతేశ్వర్ పుజారా తన టెస్టు కెరీర్‌లో 7,195 పరుగులు సాధించాడు. అందులో 19 సెంచరీలు కూడా ఉన్నాయి. సింగిల్ టెస్టు ఇన్నింగ్స్‌లో 500కు పైగా బంతులు ఆడిన ఏకైక భారత బ్యాటర్ పుజారానే. 2013లో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును పుజారా గెలుచుకున్నాడు. 2018-19లో ఆస్ట్రేలియాతో జరిగిన బీజీటీ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. 2006లో అండర్-19 వరల్డ్ కప్‌లో కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల్లో అత్యధిక టెస్టు విజయాలు (11) సాధించిన ఆటగాడు పుజారానే. 2018-19లో ఆస్ట్రేలియాతో జరిగిన బీజీటీ టోర్నీలో ఏకంగా 1258 బంతులు ఆడాడు. టెస్టులో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాటర్ పుజారానే.