2010 నుంచి అంబటి రాయుడు ఐపీఎల్ ఆడుతున్నాడు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
2010 నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు.
2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు.
ఐపీఎల్ కెరీర్‌లో అంబటి ఇప్పటివరకు 203 మ్యాచ్‌లు ఆడాడు.
ఇందులో 4329 పరుగులు సాధించాడు.
చెన్నైకి ఆడిన మొదటి సీజన్‌లోనే అంబటి సెంచరీ చేశాడు.
తన కెరీర్‌లో ఏకైక సెంచరీ ఇదే.
అంబటి రాయుడు సగటు 28.29 కాగా, స్ట్రైక్ రేట్ 127.29గా ఉంది.
22 అర్థ సెంచరీలు కూడా కొట్టాడు.