ఐపీఎల్ లీగ్ దశకు అదిరిపోయే ముగింపు లభించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీని గుజరాత్ ఓడించి ఇంటికి పంపించేసింది. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ పాలిట వరం అయింది. వారు ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించారు. మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 197 పరుగులు చేసింది. గుజరాత్ 19.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్) సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. విజయ్ శంకర్ (53) కూడా అర్థ సెంచరీ సాధించాడు. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (101 నాటౌట్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇద్దరికీ ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం.