ఆన్‌లైన్‌లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు సైబర్ దాడులు చేస్తూ ఉంటారు. హ్యాకర్లు ప్రధానంగా మాల్‌వేర్ ఉన్న లింకులను యూజర్లకు పంపుతూ ఉంటారు. దీని ద్వారా వారు పర్సనల్ డేటాను దొంగిలిస్తారు. నకిలీ ఈమెయిల్స్ పంపడం కూడా ఇందులో భాగమే. ఒక్కోసారి ఇవి ఈమెయిల్ ఆథెంటికేషన్ స్టాండర్డ్స్‌ను కూడా దాటేస్తాయి. ఈ మెయిల్స్‌లో ఉన్న అటాచ్‌మెంట్స్‌లో కూడా మాల్వేర్ ఉంటుంది. ఫిషింగ్ మెసేజెస్ కూడా ఈ స్కామ్‌లో భాగం. బ్రాండ్స్ నుంచి వచ్చినట్లు మెయిల్స్ పంపి వినియోగదారులను మోసం చేస్తారు. దీంతోపాటు వీరు బ్రాండ్స్‌కు సంబంధించిన నకిలీ వెబ్ సైట్లు కూడా కాపీ చేస్తారు. ఇందులో లాగిన్ అయితే మన క్రెడిన్షియల్స్ కూడా వారి దగ్గరకు వెళ్లిపోతాయి.