ఎలాన్ మస్క్ ట్విట్టర్(ఎక్స్) ద్వారా నగదు సంపాదించే అవకాశం కల్పించారు. యాడ్ రెవిన్యూని ఎలాన్ మస్క్ క్రియేటర్లతో షేర్ చేసుకుంటున్నారు. ఈ మోడల్ కింద తమకు వచ్చే యాడ్ రెవిన్యూని ఎక్స్ క్రియేటర్లతో షేర్ చేసుకోనుంది. ఎక్స్ ద్వారా మీరు కూడా నగదు సంపాదించవచ్చు. దీని కోసం మూడు కండీషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటిగా మీకు కనీసం 500 మంది ఫాలోయర్లు ఉండాలి. గత మూడు నెలల్లో మీ ఖాతాకు కనీసం ఐదు మిలియన్ల ఇంప్రెషన్లు ఉండాలి. ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా పొంది ఉండాలి. ‘ట్విట్టర్ బ్లూ’ సబ్‌స్క్రిప్షన్‌నే, ‘ఎక్స్ ప్రీమియం’గా మార్చారు. యూట్యూబ్ తరహాలోనే ఎక్స్‌లో కూడా నగదు సంపాదించవచ్చు.