సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు దాటింది. దీనికి ముందు దర్బార్, కబాలి, రోబో, పేట, 2.0 సినిమాలు కూడా ఈ క్లబ్‌లో చేరాయి. తమిళ సినిమాల్లో ఈ మార్కును దాటిన హీరోలు ఇంకా ఉన్నారు. చియాన్ విక్రమ్ ‘ఐ’తో మొదటిసారి రూ.200 కోట్ల మార్కు దాటారు. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా కూడా ఈ లిస్టులో చేరింది. విజయ్ నటించిన ‘వారిసు’, ‘బిగిల్’, ‘మెర్సల్’, ‘మాస్టర్’ ఈ జాబితాలో చేరాయి. అజిత్ కుమార్ కూడా ‘విశ్వాసం’, ‘వలిమై’ కూడా మంచి వసూళ్లు సాధించాయి. నటుడు కార్తీ కూడా ‘పొన్నియిన్ సెల్వన్ 1’తో ఈ లిస్ట్‌లో చేరాడు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ‘విక్రమ్’, ‘మాస్టర్’ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.