ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ప్రీమియర్ షో ముంబైలో జరిగింది.

దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

2023 ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదల అయింది.

ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించారు.

2019లో వచ్చిన ‘డ్రీమ్ గర్ల్’కు ఈ సినిమా సీక్వెల్.

ఫస్ట్ పార్ట్ బంపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్ వచ్చింది.

ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా సరసన అనన్య పాండే నటించారు.

రాజ్ శాండిల్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ సినిమాను నిర్మించారు.