బాలీవుడ్ బ్యూటీ సాన్యా మల్హోత్రా తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేశారు.

ఇందులో తను చాలా అందంగా కనిపిస్తుంది.

2016లో వచ్చిన ‘దంగల్’ సినిమాతో సాన్యా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ కూతురి పాత్రలో కనిపించారు.

ఆ తర్వాత తనకు వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి.

2020 నుంచి ఏటా కనీసం రెండు సినిమాల్లో సాన్యా నటిస్తున్నారు.

ఇటీవలే సూపర్ హిట్ అయిన ‘జవాన్’లో కూడా సాన్యా కీలక పాత్రలో నటించారు.

ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది.

తాను నటించిన ‘శామ్ బహదూర్’ త్వరలో విడుదల కానుంది.

అంతే కాకుండా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ రీమేక్‌లో కూడా నటిస్తున్నారు.