ఇన్‌స్టాగ్రామ్ ఈ మధ్య తన వినియోగదారులకు నోటిఫికేషన్లు ఎక్కువగా పంపిస్తుంది.

మెసేజ్‌లు మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి.



మనం ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్లు విసిగిస్తూ ఉంటాయి.



అలాంటప్పుడు వాటిని మనం వాటిని కంట్రోల్ చేయవచ్చు.



దీనికి ముందుగా మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి.



అందులో ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’ ఎంచుకోవాలి.



ఆ ఆప్షన్‌లో ‘నోటిఫికేషన్స్’లోకి వెళ్లాలి.



అక్కడ ‘పుష్ నోటిఫికేషన్స్’ సెక్షన్ కనిపిస్తుంది.



అందులో ‘పాజ్ ఆల్’ను ఎనేబుల్ చేయాలి.



అక్కడే పుష్ నోటిఫికేషన్స్ కస్టమైజే చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు.