మీరు మొబైల్‌లో ఫేస్‌బుక్ లాగిన్ అయితే పుష్ నోటిఫికేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వీటిని కస్టమైజ్ చేసుకుంటే తక్కువ నోటిఫికేషన్లు వస్తాయి.

దీని కోసం ముందుగా మీ ఫేస్‌బుక్ యాప్‌ను లాంచ్ చేయండి.

అందులో ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి కిందకు వెళ్లే ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’ ఆప్షన్ కనిపిస్తుంది.

అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్‌ను ఎంచుకోవాలి.

అక్కడ మీకు కామెంట్స్, ట్యాగ్స్, రిమైండర్స్, యాక్టివిటీ ఆప్షన్లు కనిపిస్తాయి.

వాటిలో మీకు కావాల్సినవి ఉంచుకుని మిగతావి తీసేయవచ్చు.