Image Source: Pixabay

యూట్యూబ్‌లో ఒకదాని తర్వాత ఒక వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అవ్వడం సహజమే.

దీని వల్ల డేటా అధికంగా ఖర్చవుతుంది.



ఒకవేళ ఒక వీడియో ప్లే చేసి మర్చిపోయి ఫోన్ పక్కన పెడితే వీడియోలు ప్లే అవుతూనే ఉంటాయి.



దీన్ని ఆపడానికి ఒక దారి ఉంది.



ముందుగా మీ ఫోన్‌లో యూట్యూబ్ యాప్ లాంచ్ చేయండి.



అందులో సెట్టింగ్స్‌పై క్లిక్ చేయండి.



అక్కడ మీకు ‘ఆటోప్లే’ ఆప్షన్ కనిపిస్తుంది.



దాని మీద క్లిక్ చేసి మీరు ఆటోప్లేను డిజేబుల్ చేయవచ్చు.



ఆ తర్వాత మీరు మీకు కావాల్సిన మాత్రమే ప్లే చేసుకోవచ్చు.



ఇది మీ డేటాను కాపాడుతుంది.