నిఫ్టీ అర పాయింటు పెరిగి 19,674 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 154 పాయింట్ల లాభంతో 44,766 వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ (4.49%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.97%), టాటా కన్జూమర్ (3.17%), అపోలో హాస్పిటల్స్ (1.96%), కోల్ ఇండియా (1.76%) షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో (2.06%), ఎస్బీఐ లైఫ్ (1.77%), ఇన్ఫీ (1.39%), హీరోమోటో (1.63%), ఎం అండ్ ఎం (1.25%) షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.75,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.24,560 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 21,69,446 వద్ద ఉంది.