నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 19,674 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగింది. నిఫ్టీ బ్యాంక్ 11 పాయింట్ల నష్టంతో 44,612 వద్ద ముగిసింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.86%), ఎస్బీఐ (1.79%), మారుతీ (2.61%), ఏసియన్ పెయింట్స్ (1.12%), ఎం అండ్ ఎం (1.69%) షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ (2.32%), విప్రో (2.44%), యూపీఎల్ (1.83%), సిప్లా (1.66%), బజాజ్ ఆటో (1.58%) షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.94 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 తగ్గి రూ.59,840 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.75,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.24,640 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 1.25 శాతం తగ్గి రూ.22.08 లక్షల వద్ద కొనసాగుతోంది.