మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను చాట్‌బాట్‌లతో పంచుకోవద్దు.
బ్యాంక్ ఖాతా సంఖ్యలు, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి ఆర్థిక సమాచారాన్ని ఎప్పటికీ చాట్‌బాట్‌లకు ఇవ్వవద్దు.
మీ పాస్‌వర్డులను ఎవరితోనూ పంచుకోవద్దు, ముఖ్యంగా చాట్‌బాట్‌లతో
మీ వ్యక్తిగత రహస్యాలను చాట్‌బాట్‌లతో పంచుకోవడం వల్ల అవి లీక్ అయ్యే అవకాశం ఉంది.
చాట్‌బాట్‌లు వైద్యులు కాదు, అందువల్ల ఆరోగ్య సంబంధిత సలహాలు లేదా వివరాలను వాటితో పంచుకోవద్దు.
ఇంటర్నెట్‌లో ఇచ్చిన సమాచారం శాశ్వతంగా నిల్వవుంటుంది, అందువల్ల అభ్యంతరకర విషయాలను చాట్‌బాట్‌లతో పంచుకోవద్దు.
మీరు ప్రపంచం నుండి దాచాలనుకునే సమాచారాన్ని చాట్‌బాట్‌లతో పంచుకోవడం మానుకోండి, ఎందుకంటే అవి మీ డేటాను నిల్వచేస్తాయి.