ఛాట్ జీపీటీని మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. వాటిలో కొన్నిటిని చూద్దాం. దీని ద్వారా రీసెర్చ్ కోసం సమాచారాన్ని సంపాదించవచ్చు. ఈ ఏఐ ఛాట్ బోట్ ద్వారా కొత్త భాషలు నేర్చుకోవచ్చు. ఛాట్ జీపీటీని ఉపయోగించి మీ రైటింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు. మీ గ్రామర్, వొకాబులరీని మెరుగుపరుచుకోవచ్చు. మీ అపాయింట్‌మెంట్స్, రిమైండర్స్‌ను మేనేజ్ చేసే పర్సనల్ అసిస్టెంట్‌గా ఉపయోగించుకోవచ్చు. వేర్వేరు టాపిక్స్ మీద ఈ బోట్‌తో ఛాటింగ్ చేయవచ్చు. మీ రెజ్యూమ్ రాయడానికి ఉపయోగించుకోవచ్చు. ఛాట్ జీపీటీ ద్వారా మీరు గేమ్స్ కూడా ఆడవచ్చు. రీసెర్చ్ రిపోర్ట్స్‌కు సంబంధించిన వెబ్ పేజీలు, సమ్మరీలు పొందవచ్చు.