అక్టోబరులో పుట్టినవాళ్లు ఈ విషయాల్లో చాలా ప్రత్యేకం!



అక్టోబరులో పుట్టినవారు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ వ్యక్తులు ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగల సాటిలేని మనోజ్ఞతను కలిగి ఉంటారు. వీరితో స్నేహంగా ఉండేందుకు చాలామంది తాపత్రయపడతారు.



ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. తమ భావాలను, భావోద్వేగాలను మనసులోనే దాచుకునేందుకు ఇష్టపడతారు. వీరు అంతర్ముఖులు.



శత్రువుల కన్నా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం అని నమ్ముతారు. అందుకే వీరివల్ల చాలామందికి మేలు తప్ప హాని జరగదు. ఇతరుల సమస్యలపట్ల చాలా సున్నితంగా ఉంటారు.



శత్రువుల కన్నా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం అని నమ్ముతారు. అందుకే వీరివల్ల చాలామందికి మేలు తప్ప హాని జరగదు. ఇతరుల సమస్యలపట్ల చాలా సున్నితంగా ఉంటారు. తమవంతు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటారు.



జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు, ఓ దశలో పూర్తిగా నిరుత్సాహపడతారు..కానీ పడిలేచిన కెరటంలా కెరీర్లో దూసుకెళతారు.స్థిరమైన జావితాన్ని ఆస్వాదించగలుగుతారు.



అక్టోబర్‌లో జన్మించిన వారు విలాసవంతమైన వస్తువులను కలిగి ఉండటానికి ఇష్టపడతారు. తమ కోసం ఖర్చు చేయడమే కాదు, తమ ప్రియమైన వారికోసం కూడా ఖర్చుచేయడంలో ముందుంటారు.



ఈ నెలలో పుట్టినవారు సాధారణంగా తెలివైన వారు. తమకు ఆసక్తి ఉన్న రంగంలో మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి తమ సమయాన్ని, డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం, తెలివితేటల్నే నమ్ముకుని ముందడుగు వేస్తారు.



వీరికి ఏకాగ్రత ఎక్కువ. పరిస్థితులను గమనించి, విశ్లేషించి, సాధారణంగా అందరినీ మెప్పించే ఉత్తమమైన పరిష్కారాలతో ముందుకు వస్తారు. వారి ఆలోచన పదును తెలుసుకున్నవారు జీవితంలో ఎదురైన కష్టాలనుంచి బయట పడేందుకు వీరి సలహాలు అడుగుతారు.



భవిష్యత్ , గతం గురించి ఆలోచించడానికి ఇష్టపడరు..ఈ క్షణం సంతోషంగా ఉన్నామా లేదా అన్నదే ఆలోచిస్తారు. సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చెందుతారు..దాని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడరు.



అక్టోబరులో జన్మించిన వారు రొమాంటిక్‌గా ఉంటారు. వీరు ప్రేమకు, ప్రేమికులకు ఎక్కువ విలవనిస్తారు. మంచి తెలివితేటలు, లౌకిక జ్ఞానం ఉంటుంది, కళలపై మంచి అభిరుచి ఉంటుంది, వీరికి దైవభక్తి కూడా ఎక్కువే



Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి (images credit: pinterest)